Acha Telugandhame Song Lyrics written by Ramajogayya Sastry Garu, Sung by Popular singers Sid Sriram, Anudeep Dev & Namitha Babu Garu and music composed by Ghibran Garu from the Telugu film ‘Hero‘.
నింగిలో తారక నేలపై వాలెనే
కన్నుల పండగై కాలమే ఆగెనే
ప్రేమనే బాణమే నన్నిలా తాకెనే
నేననే ప్రాణమే నువ్వుగా మారెనే
బుజ్జి గుండె వెండితెర నిన్ను చూసి
మెచ్చుకుంది కోరుకున్న హీరోయిన్ నువ్వనీ
డ్రీంల్యాండు థియేటరే నిన్ను బొమ్మ గీసుకుంది
రెప్పమూయకుండా రోజు చూసుకోవాలని
అచ్చ తెలుగందమే… నీలా కలిసే
అంబరాలనందెనే… నాలో మనసే
గాలిలో పతంగమై… వయసే ఎగసే
నా రేపుమాపు పయనమే… నీతో జతకలిసే
యు ఆర్ మై లవ్… ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్… మేరీ జాన్ ||4||
ఇప్పటివరకు ఇలా
మనసు తన చప్పుడు తను వినలేదుగా
నిన్నటి వరకు కల
అసలు తన రంగును కనలేదు కధగా
గుర్తుకురాదసలే… ఏ రోజు ఏ వారం
తిరుగుట మానినదే… నా గది గడియారం
ఇన్నినాళ్ళ ఒక్క నేను… ఇద్దరల్లే మారినాను
తట్టి లేపినవే నాలో ప్రేమనీ
పక్కపక్క నువ్వు నేను… పండుగల్లే ఉంది సీను
అద్భుతంగా మార్చినావు… ప్రతి ఒక్క ఫ్రెముని
అచ్చ తెలుగందమే… నీలా కలిసే
అంబరాలనందెనే… నాలో మనసే
గాలిలో పతంగమై… వయసే ఎగసే
నా రేపుమాపు పయనమే… నీతో జతకలిసే
యు ఆర్ మై లవ్… ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్… మేరీ జాన్ ||4||
నెమ్మది నెమ్మదిగా దరికి నను
పిలిచిన చనువుకు పడిపోయా
దగ్గర దగ్గరగా జరిగి
నీ కౌగిలిలో జతపడిపోయా
ఎప్పుడు చెరిగినదో సిగ్గుల సరిహద్దు
చప్పున దొరికినదే చక్కర తొలిముద్దు
వేచి ఉన్న గుండెలోకి
నన్ను నేను పంపినాను
చుంబనాల సంబరాల దారిగా
నాకు నువ్వు నీకు నేను
సంతకాలు చేసినాను
నింగి నేల నీరు నిప్పు గాలి వాన సాక్షిగా
అచ్చ తెలుగందమే… నీలా కలిసే
అంబరాలనందెనే… నాలో మనసే
గాలిలో పతంగమై… వయసే ఎగసే
నా రేపుమాపు పయనమే… నీతో జతకలిసే
యు ఆర్ మై లవ్… ఓ మై బేబీ
యు ఆర్ మై లవ్… మేరీ జాన్ ||4||