Chinnaga Chinnaga Song Lyrics written by Chandra Bose Garu, Sung by Popular singers Hariharan, Chitra and music composed by Mani sharma from the Telugu film ‘ Tagore’.
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
నీ మగసిరికే వేస్తా నా ఓటు
నా సొగసిరితో వేస్తా ఆ ఓటు
మెల్లగ మెల్లగ మెల్లగ
మరు మల్లెలు మబ్బులు జల్లుగా
ముని మాపులలో వేసేయ్ నీ ఓటు
మసి నవ్వులతో వేసేయ్ ఆ ఓటు
నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే
నీ గుండెలకే వేస్తా నా ఓటు
గుడి హారతినై వేస్తా ఆ ఓటు
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
నీ మగసిరికే వేస్తా నా ఓటు
నా సొగసిరితొ వేస్తా ఆ ఓటు
అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి
అందాలలో నువ్వే మునకే వెయ్యాలి
అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి
ఎద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి
ప్రతిపక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి
ఆ రతిపక్షం నేనై ఉండి యుద్దం చేయాలి
నా వలపు కిరీటం తలపైనే ధరించు
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు
నీ చినుకులకే వేస్తా నా ఓటు
నా చెమటలతో వేస్తా ఆ ఓటు
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
నీ మగసిరికే వేస్తా నా ఓటు
నా సొగసిరితో వేస్తా ఆ ఓటు
నా సుకుమారం నీకో సింహాసనంగా
నా కౌగిళ్ళే నీకు కార్యలయంగా
నీ నయగారం నాకో ధనాగారంగా
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా
సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది
కాముడికే మైకం కమ్మే యాగం జరిగింది
ఓ బాలుడికే పాఠం చెప్పే యోగం దక్కింది
ఆ పాల పుంతని వలవేసీ వరించే
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే
నీ రసికతకే వేస్తా నా ఓటు
నా అలసటతో వేస్తా ఆ ఓటు
చిన్నగ చిన్నగ చిన్నగ
మది కన్నులు విప్పిన కన్నెగా
నీ మగసిరికే వేస్తా నా ఓటు
నా సొగసిరితో వేస్తా ఆ ఓటు
మెల్లగ మెల్లగ మెల్లగ
మరు మల్లెలు మబ్బులు జల్లుగా
ముని మాపులలో వేసేయ్ నీ ఓటు
మసి నవ్వులతో వేసేయ్ ఆ ఓటు