Gundello Edo Sadi Song Lyrics written by Bhaskara Bhatla Garu, Sung by Popular singer Kousalya & Chakri Garu and music composed by Chakri Garu from the Telugu film ‘Golimaar‘.
గుండెల్లో ఊ హు హు
కళ్ళల్లో మ్మ్ హు హు
గుండెల్లో ఏదో సడి
ఉండుండి ఓ అలజడి
కళ్ళల్లో నువ్ కలబడి
కమ్మేస్తోంది ఈ సందడి
నా ప్రాణం కోరింది నన్నే
నీతోనే ఉంటానని
ఆనందం అంటోంది నాతో
నువ్వుంటే వస్తానని
తూనీగల్లె మారింది హృదయం
నువ్వే కనబడి
తుళ్ళి తుళ్ళి పోతోంది ప్రాయం
తెలుసా తడబడి
గుండెల్లో ఏదో సడి
ఉండుండి ఓ అలజడి
కళ్ళల్లో నువ్ కలబడి
కమ్మేస్తోంది ఈ సందడీ
నా పెదవంచులో… నీ పిలుపున్నది
నీ అరచేతిలో… నా బతుకున్నది
ఇన్నాలెంత పిచ్చోడ్ని నేను
మనసిస్తుంటే తప్పించుకున్న
మొత్తమ్మీద విసిగించి నిన్ను
ఏదోలాగా దక్కించుకున్న
మనసున్నాది ఇచ్చేనందుకే
కనులున్నాయి కలిపేందుకే
అని తెలిసాక నీ ప్రేమలో పడిపోయానులే
గుండెల్లో ఏదో సడి
ఉండుండి ఓ అలజడి
కళ్ళల్లో నువ్వు కలబడి
కమ్మేస్తోంది ఈ సందడి
నీ కౌగిళ్ళలో నా తల వాల్చనీ
ఈ గిలిగింతలో నే పులకించనీ
నాకో తోడు కావాలి అంటూ
ఎపుడూ ఎందుకనిపించలేదు
వద్దొద్దంటూ నీ మొత్తుకున్న
మనసే వచ్చి నడిచింది నీతో
కన్నీళ్లొస్తే తుడిచేందుకు
సంతోషాన్ని పంచేందుకు
ఎవరు లేని జన్మెందుకు అనిపించిందిలే
గుండెల్లో ఏదో సడి
ఉండుండి ఓ అలజడి
కళ్ళలో నువ్వు కలబడి
కమ్మేస్తోంది ఈ సందడి
నా ప్రాణం కోరింది నన్నే
నీతోనే ఉంటానని
ఆనందం అంటోంది నాతో
నువ్వుంటే వస్తానని
తూనీగల్లె మారింది హృదయం
నువ్వే కనబడి
తుళ్ళి తుళ్ళి పోతోంది ప్రాయం
తెలుసా తడబడి
గుండెల్లో ఊ హు హు
కళ్ళల్లో ఆహా హా