Monna Kanipinchavu Song Lyrics written by Veturi Sundararam Muthy Garu, Sung by Popular singer Naresh Iyer & Prashanthini Garu and music composed by Harris Jeyaraj Garu from the Telugu film ‘Surya s/o Krishnan‘.
మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధాయనే
పరువాల నీ వెన్నెల… కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధాయనే
త్రాసులో నిన్నే పెట్టి… తూకానికి పుత్తడి పెడితే
తులాభారం తూగేది ప్రేయసికే
ముఖం చూసి పలికే వేళ… భలే ప్రేమ చూసిన నేను
హత్తుకోకపోతానా అందగాడా
ఓ నీడవోలే వెంబడి ఉంటా… తోడుగా చెలీ
పొగవోలే పరుగున వస్తా… తాకనే చెలీ
వేడుకలు కలలు నూరు.. వింత ఓ చెలి
మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక… ఓ మై లవ్
ఎందెందు వెతికానో కాలమే వృధాయనే… ఎస్ మై లవ్
కడలి నేల పొంగే అందం… అలలు వచ్చి తాకే తీరం
మనసు జిల్లుమంటుంది ఈ వేళలో
తలవాల్చి ఎడమిచ్చావే… వేళ్ళు వేళ్ళు కలిపేసావే
పెదవికి పెదవి దూరమెందుకే
పగటి కలలు కన్నా నిన్ను కునుకులేకనే
హృదయమంత నిన్నే కన్నా దరికిరాకనే
నువ్వు లేక నాకు లేదు లోకమన్నదే
మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేసావే
ఇన్నెన్నినాళ్ళైనా నీ జాడ పొడలేక
ఎందెందు వెతికానో కాలమే వృధాయనే
పరువాల నీ వెన్నెల… కనలేని నా వేదన
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
ఈ పొద్దే నా తోడు వచ్చేయ్ ఇలా
ఊరంతా చూసేలా అవుదాం జత
వెన్నెలా… వెన్నెలా… వెన్నెలా