Muvvala Navvakala Song Lyrics written by Sirivennela Seetharama Sastry Garu, Sung by Popular singer S P Balasubramanyam Garu and music composed by Devi Sri Prasad Garu from the Telugu film ‘Pournami‘.
మువ్వలా నవ్వకలా… ముద్ద మందారమా
మువ్వలా నవ్వకలా… ముద్ద మందారమా
ముగ్గులో దించకిలా… ముగ్ద సింగారమా
నేలకే నాట్యం నేర్పావే… నయగారమా
గాలికే సంకెళ్లేశావే… ఏ ఏ
నన్నిలా మార్చగల… కళ నీ సొంతమా
ఇది నీ మాయవల కాదని అనకుమా…
ఆశకే ఆయువు పోశావే… మధుమంత్రమా
రేయికే రంగులు పూశావే…
కలిసిన పరిచయం ఒకరోజే కదా… కలిగిన పరవశం యుగముల నాటిదా
కళ్ళతో చూసే నిజం, నిజం కాదేమో… గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో
ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ…
నన్నిలా మార్చగల… కళ నీ సొంతమా
ఇది నీ మాయవల కాదని అనకుమా…
నేలకే నాట్యం నేర్పావే… నయగారమా
గాలికే సంకెళ్లేశావే…
ఆ ఆ ఆ ఆఆ ఆ……..
పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ… మరియొక జన్మగా మొదలవుతున్నదా
పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా… మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా
ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ…
మువ్వలా నవ్వకలా… ముద్ద మందారమా
ముగ్గులో దించకిలా… ముగ్ద సింగారమా
ఆశకే ఆయువు పోశావే… మధుమంత్రమా
రేయికే రంగులు పూశావే