Naa Chupe Ninu Vethikinadi Song Lyrics written by Sirivennela Seetharama Sastry Garu, Sung by Popular singers Chitra, Prabhu & Sriram Garu and music composed by Koti Garu from the Telugu film ‘Nuvvu Naku Nachav‘.
నా చూపే నిను వెతికినది
నీవైపే నను తరిమినది
నాకెందుకిలా ఔతోంది
నా మదినడిగితె చెబుతుంది
నువ్వే నువ్వే… తనలోనె ఉన్నావంటూ
నీకే నీకే చెప్పాలి అంటున్నది
నా చూపే నిను వెతికినది
నీవైపే నను తరిమినది
నాకెందుకిలా ఔతోంది
నా మదినడిగితె చెబుతుంది
నువ్వే నువ్వే… తనలోనె ఉన్నావంటూ
నీకే నీకే చెప్పాలి అంటున్నది
నిన్నే తలచిన… ప్రతి నిమిషం
ఏదో తెలియని తియ్యదనం
నాలో నిలవని… నా హృదయం
ఏమౌతుందని చిన్న భయం
గుండెలోన చోటిస్తాలే… నన్ను చేరుకుంటే
వేలు పట్టి నడిపిస్తాలే… నా వెంటే నీవుంటే
నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటూ
నీకే నీకే చెప్పాలి అంటున్నది
నా చూపే నిను వెతికినది
నీవైపే నను తరిమినది
నాకెందుకిలా ఔతోంది
నా మదినడిగితె చెబుతుంది
నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటూ
నీకే నీకే చెప్పాలి అంటున్నది
పెదవులు దాటని ఈ మౌనం
అడిగేదెలాగ నీ స్నేహం
అడుగులు సాగని సందేహం
చెరిపేదెలాగ ఈ దూరం
దిగులు కూడ తీయగలేదా… ఎదురు చూస్తూ ఉంటే
పగలు కూడ రేయైపోదా… నీవుంటే నా వెంటే
నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటూ
నీకే నీకే చెప్పాలి అంటున్నది
నా చూపే నిను వెతికినది
నీవైపే నను తరిమినది
నాకెందుకిలా ఔతోంది
నా మదినడిగితె చెబుతుంది
నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటూ
నీకే నీకే చెప్పాలి అంటున్నది