Nallareni Kalladhaanaa Song Lyrics written by Bhaskar Yadav Dasari Garu, Sung by Popular singer Armaan Malik Garu and music composed by Osho Venkat Garu from the Telugu film ‘Dharmapuri‘ .
Nallareni Kalladhaana Song Details
Movie
Dharmapuri (20210
Director
Vishwajagath
Producer
Bhaskar Yadav Dasari
Singer
Armaan Malik
Music
Sri Charan Pakala
Lyrics
Bhaskar Yadav Dasari
Star Cast
Gagaan Viharri, Aparna Devi
Music Label
Aditya Music
Nallareni Kalladhaanaa Song Lyrics In English
Sittamolla Pollaadhaana
Sitta Sitta Nadisedhaana
Beedila Buttaa Dhaana
Kharkhaana Thovvadhaana
Ninnu Joothe Kannu Gotte
Paanamanthaa Igamu Batte
Ambatela Salvaa Butte
Poddhumeeki Garmee Batte
Peereela Saayabu Emouthundho Seppaabatte
Nallareni Kalladhaanaa
Naaga Nadumu Dhaana
Allaneredu Pandhiresi
Pelli Jesukonaa
Nallaregadi Makkasenula
Pandiri Mancham Kaana
Mana Erka Parkalu Cheppukoni
Engilai Podhaamaa
Watch నల్లరేణి కళ్లదానా Lyrical Video Song
VIDEO
Nallareni Kalladhaanaa Song Lyrics In Telugu
ఏలేల లేల లేల లేలో, ఓ ఓ
సిట్టమొల్ల పొల్లాదానా… సిట్ట సిట్ట నడిసేదాన
బీడీల బుట్టాదాన… కార్ఖాన తొవ్వదాన
నిన్ను జూత్తే కన్నూగొట్టే… పాణమంతా ఇగముబట్టే
అంబటేల సల్వా బుట్టే… పొద్దుమీకి గర్మీబట్టే
పీరీల సాయబు ఏమౌతుందో సెప్పాబట్టే
నల్లరేణి కళ్లదానా… నాగ నడుము దాన
అల్లనేరెడు పందిరేసి… పెళ్ళి జేసుకోనా
నల్లరేగడి మక్కసేనుల… పందిరి మంచం కాన
మన ఎర్క పర్కలు చెప్పుకోని… ఎంగిలై పోదామా
ఆ ఆఆ, సిట్టమొల్ల పొల్లాదానా
సిట్ట సిట్ట నడిసేదాన
బీడీల బుట్టాదాన
కార్ఖాన తొవ్వదాన
గునూగు పూలను పేర్చిన
బతుకమ్మకు మొరను జెక్కే
యాపాకుల్లో బంతులు సుట్టి
బొట్టు పెట్టి బోనం మొక్కే
పైలమైన సోపతి నాది
పాణమైనా ఇత్తనే పిల్లా
వద్దనీ సెప్పకు పొల్లా
పతారా తీయకు మళ్ళా
బొందిలో ఊపిరుండగా
పట్టినేలు ఇడవను పిల్లా
సావైనా బతుకైనా
నీతోనే మళ్ళీ మళ్ళా
నల్లరేణి కళ్లదానా… నాగ నడుము దాన
అల్లనేరెడు పందిరేసి… పెళ్ళి జేసుకోనా
నల్లరేగడి మక్కసేనుల… పందిరి మంచం కాన
మన ఎర్క పర్కలు చెప్పుకోని… ఎంగిలై పోదామా
మాగి దినం మొగులు మీద
కాసిన సింగిడి నీవే
మిరుగు పొద్దు దర్వాజలో
వేసిన పసుపు నీవే
ఎటమాటం సెయ్యకె నువ్వే
నసీబని నమ్మితి పిల్లా
పస్కమీద అమ్మోరికి
లష్కర్ బోయి బోనమెత్తుతా
తంగేడు పువ్వోలె నిన్ను
పాయిరంగా జూసుకుంటా
పైడి ముడుపు లగ్గం బెట్టి
సుట్టాలకు సెప్పొత్తానే
నల్లరేణి కళ్లదానా… నాగ నడుము దాన
అల్లనేరెడు పందిరేసి… పెళ్ళి జేసుకోనా
నల్లరేగడి మక్కసేనుల… పందిరి మంచం కాన
మన ఎర్క పర్కలు చెప్పుకోని… ఎంగిలై పోదామా