Neeve Neeve Song Lyrics written by Kandikonda Garu, Sung by Popular singer S P Charan Garu and music composed by Chakri Garu from the Telugu film ‘Amma Nanna O Tamila Ammai‘.
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేకా నేనే లేనంటా
వరమల్లే అందిదేమో ఈ బంధం
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేకా నేనే లేనంటా
వరమల్లే అందిదేమో ఈ బంధం
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేకా నేనే లేనంటా
నా కలలని కన్నది నీవే
నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
ఓ ఓ, నా కష్టం ఇష్టం నీవే
చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై… ఉంది నీవేగా
కనిపించక పోతే బెంగై వెతికేవే
కన్నీరే వస్తే కొంగై తుడిచేవే…
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేకా నేనే లేనంటా
నే గెలిచిన విజయం నీదే
నే ఓడిన క్షణమూ నాదే
నా అలసట తీరే తావే నీవేగా
అడుగడుగున నడిపిన దీపమ
ఇరువురికే తెలిసిన స్నేహమ
మది మురిసే ఆనందాలే నీవేగా
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే
ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేకా నేనే లేనంటా
వరమల్లే అందిదేమో ఈ బంధం
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేకా నేనే లేనంటా
వరమల్లే అందిదేమో ఈ బంధం
వెలలేని సంతోషాలే నీ సొంతం
నీవే నీవే నీవే నేనంటా
నీవే లేక నేనే లేనంటా