Neevu Leni Chotedi Yesayya Song Lyrics written by Victor Rampogu Garu, Sung by singer Nissi John Garu and music composed by KY Ratnam Garu from Album Christian Song Lyrics
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా
నీవు చూడని స్థలమేది యేసయ్యా
కనుమరుగై నేనుండలేనయ్యా
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా
నీవు చూడని స్థలమేది యేసయ్యా
కనుమరుగై నేనుండలేనయ్యా
నీవు వినని మనవేది యేసయ్యా
నీవు తీర్చని భాద… ఏది యేసయ్యా ||2||
నీవుంటే నా వెంట… అదియే చాలయ్యా ||4||
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా
కయీను కౄర పగకు… బలియైన హేబేలు
రక్తము పెట్టిన… కేక విన్న దేవుడవు
అన్నల ఉమ్మడి కుట్రకు… గురియైన యోసేపు
మరణ ఘోష గోతి నుండి… విన్న దేవుడవు ||2||
యొగ్గి నా మొరను యేసయ్యా
నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా
చెవి యొగ్గి నా మొరను యేసయ్యా
నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా
నీవుంటే నా వెంట… అదియే చాలయ్యా ||4||
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా
సౌలు ఈటె దాటికి గురియైన దావీదు
ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
సాతాను పన్నిన కీడుకు… మెత్తబడిన యోబును
గెలిపించి దీవెనలు… కురిపించిన దేవుడవు ||2||
నీ తోడు నీ నీడ యేసయ్యా
నాకు లేకుంటే… నే జీవించలేనయ్యా ||2||
నీవుంటే నా వెంట… అదియే చాలయ్యా ||4||
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా
నీవు చూడని స్థలమేది యేసయ్యా
కనుమరుగై నేనుండలేనయ్యా