Nindu Noorella Savasam Song Lyrics written by Sai Sri Harsha Garu, Sung by Popular singer Sonu Nigam, Mahalakshmi Iyer Garu and music composed by Kamalakar Garu from the Telugu film ‘Pranam‘.
నేల తల్లి సాక్షిగా… నింగి తండ్రి సాక్షిగా
గాలి దేవర సాక్షిగా… అగ్ని దేవుని సాక్షిగా
గంగమ్మే సల్లంగా దీవించగా…
ఓఓ ఓఓ హొహో… ఓఓ ఓఓ హొహో
నిండు నూరేళ్ళ సావాసం… స్వర్గమవ్వాలి వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం… వెండి ఎన్నెల్లో కళ్యాణం
ఈ రీతులు గీతలు… సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో… సెలిమే చేద్దాములే
నిండు నూరేళ్ళ సావాసం… స్వర్గమవ్వాలి వనవాసం
హహ్హాహ్హా హహ్హాహ్హా…
ఆ ఆఆ ఆఆ ఆఆఆ… ఓ ఓ ఓఓఓ ఓఓ
సందమామ ఊరిలో… ఎన్నెలమ్మ వాడలో
అచ్చ తెలుగు… ముచ్చపూల పున్నమేనులే ఓ ఓ
రెల్లు కప్పు నేసిన… ఇంద్రధనస్సు గూటిలో
రేయి పగలు ఒక్కటేలె… రెప్ప పడదులే
ఈ మబ్బులే మన నేస్తులు… ఆ దిక్కులే మన ఆస్తులు
సల్ల గాలుల పల్లకీలలో… సుక్క సుక్కనీ సుట్టి వద్దమా
నిండు నూరేళ్ళ సావాసం… స్వర్గమవ్వాలి వనవాసం
ఈ రీతులు గీతలు… సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో… సెలిమే చేద్దాములే
వర్జ్యమంటు లేదులే… రాహుకాలమేదిలే
రాశి లేదు వాశి లేదు… తిథులు లేవులే ఓ ఓ
అథిధులంటు లేరులే… మనకు మనమే సాలులే
మాసిపోని బాసలన్ని… బాసికాలులే
ఏ ఏలుపు దిగి రాదులే… మన కూడికే మన తొడులే
ఇసిక దోసిలే తలంబ్రాలుగా… తలలు నింపగా మనువు జరిగెలే
ఆ ఆఆ ఆఆ ఆఆఆ… ఓ ఓ ఓఓఓ ఓఓ
నిండు నూరేళ్ళ సావాసం… స్వర్గమవ్వాలి వనవాసం
ఆ ఆఆ ఆఆ ఆఆఆ… ఓ ఓ ఓఓఓ ఓఓ
లల లాలా లాలాల… లల లాలా లాలాల