Ninne Ninne Song Lyrics written by Ramesh Vakacharla Garu, Sung by Popular singer Armaan Malik & Yamini Ghantasala Garu and music composed by Sri Charan Pakala Garu from the Telugu film ‘Aswathama‘.
నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నే వేచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే
అధరాలే మధురంగా కలిశాయే ఏకంగా
విరహాలే దూరంగా నిను చేరంగా
అమావాసే పున్నమిగా
తోచే నువ్వు నవ్వంగా
నీలో నను చూశాక నను నేనే మరిచెనుగా
నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నే వేచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే
నా గుండెల్లో ప్రియరాగాలే
మోగే నీ కనుసైగల్లో
నా కనుల్లో చెలి అందాలే
నలిగే నీ నడుమొంపుల్లో
కలలో ఇలలో ప్రతి ఊహల్లో
నువ్వే నా కనుపాపల్లో
మొదలో తుదలో ప్రతి ఘడియల్లో
చెలియా నువ్వే నాలో
అధరాలే మధురంగా కలిశాయే ఏకంగా
విరహాలే దూరంగా నిను చేరంగా
అమావాసే పున్నమిగా
తోచే నువ్వు నవ్వంగా
నీలో నను చూశాక నను నేనే మరిచెనుగా
నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నే వేచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే, ఏ ఏ ఏ