Okkasari Cheppaleva Song Lyrics written by Sirivennela Seetharama Sastry Garu, Sung by Popular singerKumar Sanu & Chitra Garu and music composed by Koti Garu from the Telugu film ‘Nuvvu Naku Nachav‘.
ఒక్కసారి చెప్పలేవ… నువ్వు నచ్చావని
ఓ ఓఓ, చెంత చేరి పంచుకోవా… ఆశని శ్వాసని
మన గుండె గుప్పెండంతా… తన ఊహ ఉప్పెనంతా
ఒదిగుండమనక వదిలేయమంటు… బతిమాలుతున్న వేళా
వెన్నెలేదో వేకువేదో… నీకు తెలుసా మరి
ఓ ఓఓ, నిదురపొయే మదిని గిల్లి… ఎందుకా అల్లరి
చందమామ మనకందడని
ముందుగానె అది తెలుసుకుని
చేయిచాచి పిలవద్దు అని
చంటి పాపలకు చెబుతామా
లేనిపోని కలలెందుకని
మేలుకుంటె అవి రావు అని
జన్మలోనె నిదరోకు అని
కంటి పాపలకు చెబుతామా
కలలన్నవి కలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభూతి
మననడిగి చేరుతుందా
ఒక్కసారి చెప్పలేవ… నువ్వు నచ్చావని
ఓ ఓఓ… చెంత చేరి పంచుకోవా… ఆశని శ్వాసని
అందమైన హరివిల్లులతో
వంతెనేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగివస్తుంటే
కరిగిపోని దూరం ఉందా
అంతులేని తన అల్లరితో
అలుపు లేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే
ఆకాశం తెగి పడుతుందా
మనసుంటే మార్గం ఉంది కదా
అనుకుంటే అందనిదుంటుందా
అనుకున్నవన్ని మనకందినట్టె
అనుకుంటే తీరిపోదా
ఒక్కసారి చెప్పలేవ… నువ్వు నచ్చావని
ఓ ఓఓ, చెంత చేరి పంచుకోవా… ఆశని శ్వాసని
మన గుండె గుప్పెండంతా… తన ఊహ ఉప్పెనంతా
ఒదిగుండమనక వదిలేయమంటు… బతిమాలుతున్న వేళా