Poruginti Mangala Gowri Song Lyrics written by Sirivennela Seetharama Sastry Garu, Sung by Popular singer S P Balu & KS Chitra Garu and music composed by SV Krishna Reddy Garu from the Telugu film ‘Subhalagnam‘.
పొరుగింటి మంగళగౌరి… వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్నిగారి… కాసులపేరు చూడు
ఇరుగు పొరుగువాళ్ళు… భలే బాగుపడ్డారు
నగా నట్రా, టీవీ గట్రా… కొనుక్కున్నారు
మనకు మల్లే… ఎవరు ఉన్నారు..?
ఉసూరంటూ… ఇలా ఎన్నాళ్ళు…?
మన బతుకేమో… ఇట్టా తగలబడింది
ఎక్కడ వేసిన గొంగళి… అక్కడే ఉంది
పక్కాళ్ళ పాడుగోల… పట్టించుకోవద్దే
పొరుగింటి పుల్లకూర… తెగమెచ్చుకోవద్దే
నెత్తిని పెట్టుకు చూసే మొగుడు… నీకూ ఉన్నాడే
అందని పళ్ళకు… అర్రులు చాచి అల్లరిపడొద్దే
మనకి లేక… అదో ఏడుపా..?
పరులకుంటే… మరో ఏడుపా..?
ఎందుకే ఇట్టా… రోజూ మెదడు తింటావు
ఇంటిగుట్టంతా… వీధిన పెట్టుకుంటావు
కాంతమ్మగారు కట్టే చీర… ఖరీదైనా లేదే పాపం, తమ జీతం
నేతచీర కట్టుకున్నా… కొట్టవచ్చేటట్టు ఉండే అందం, నీ సొంతం
ఉత్తిమాటలెన్ని అన్నా… నా సరదా తీరదుగా
ఉన్నదానితోనే మనం… సర్దుకుంటే మంచిదిగా
కట్టుకున్నదాని సంబరం… తీర్చడమే పురుష లక్షణం
సంపదలోనే లేదు సంతోషం… చంపకే నన్ను నీ డాబుకోసం
పొరుగింటి మంగళగౌరి… వేసుకున్న గొలుసు చూడు
ఎదురింటి పిన్నిగారి… కాసులపేరు చూడు
ఫలానావారి మిస్సెసంటూ… అంతా మెచ్చుకుంటే
మీకే గొప్ప కాదా..!!
ఆ బోడి పదవికని… అప్పో తప్పో చెయ్యమంటే
ఊళ్ళో పరువు పోదా..!!
కానీకి కొరగాని… పరువూ ఓ పరువేనా
మగాన్ని తూచేది… వాడి పర్సు బరువేనా
డబ్బులేని దర్పమెందుకు..?
అయ్యో..! చేతగాని శౌర్యమెందుకు..?
నీకు మొగుడయే యోగ్యత… మనిషికి లేదే
ఇనప్పెట్టెనే వరించి ఉండాల్సిందే..!!
పొరుగింటి మంగళగౌరి… వేసుకున్న గొలుసు చూడు… ఆ
ఎదురింటి పిన్నిగారి… కాసులపేరు చూడు, ఛా
ఇరుగు పొరుగువాళ్ళు… భలే బాగుపడ్డారు..ఏడ్సారు
నగా నట్రా, టీవీ గట్రా… కొనుక్కున్నారు
మనకి లేక అదో ఏడుపా…?
పరులకుంటే మరో ఏడుపా…?
మన బతుకేమో… ఇట్టా తగలబడింది
ఎక్కడ వేసిన గొంగళి… అక్కడే ఉంది
ఎందుకే ఇట్టా రోజూ… మెదడు తింటావు
ఇంటిగుట్టంతా… వీధిని పెట్టుకుంటావు