Reddamma Thalli Song Lyrics written by Penchal Das Garu, Sung by Popular singer Mohana Bhogaraju and music composed by Thaman S Garu from the Telugu film ‘Aravindha Sametha‘.
ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన
ఊరికి ఉత్తారాన… దారీకి దక్షిణాన
నీ పెనిమిటి కూలినాడమ్మా
రెడ్డెమ్మ తల్లి… సక్కానైనా పెద్దా రెడ్డెమ్మ
నల్లారేగడి నేలలోన… ఎర్రాజొన్న చేలలోన
నల్లారేగడి నేలలోన… ఎర్రాజొన్న చేలలోన
నీ పెనిమిటి కాలినాడమ్మా… రెడ్డెమ్మ తల్లి
గుండెలవిసి పోయె గదమ్మా
సిక్కే నీకు సక్కానమ్మ… పలవారేని దువ్వెనమ్మ
సిక్కే నీకు సక్కానమ్మ… పలవారేని దువ్వెనమ్మా
సిక్కు తీసి కొప్పె పెట్టమ్మ… రెడ్డమ్మ తల్లి
సింధూరం బొట్టు పెట్టమ్మా
కత్తివాదర నెత్తురమ్మా… కడుపు కాలి పోయేనమ్మా
కత్తివాదర నెత్తురమ్మా… కడుపు కాలి పోయేనమ్మా
కొలిసి నిన్ను వేడినాడమ్మా… రెడ్డమ్మ తల్లి
కాచీమమ్ము బ్రోవు మాయమ్మా
నల్లాగుడిలొ కోడి కూసే
మేడాలోనా నిదుర లేసే
నల్లాగుడిలొ కోడి కూసే
మేడాలోనా నిదుర లేసే
సక్కానైన పెద్ద రెడ్డెమ్మ బంగారు తల్లి
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా
సత్యామైన పెద్ద రెడ్డెమ్మా