Saami Saami Song Lyrics written by Chandra Bose Garu, Sung by Popular singer Mounika Yadav Garu and music composed by Devi Sri Prasad Garu from the Telugu film ‘Pushpa‘.
నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే
నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా
సామి… నా సామి
నిను సామి సామి అంటాంటే
నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా
సామి… నా సామి
నీ ఎనకే ఎనకే అడుగెత్తాంటే, ఏ
ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామి
నీ పక్కా పక్కన కూసుంటాంటే
పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి
నువ్ ఎల్లే దారి సూత్తా ఉంటే
ఏరే ఎండినట్టుందిరా
సామి నా సామి
నా సామి… రారా సామి
బంగరు సామి… మీసాల సామి
రోషాల సామి
నా సామి (సామి)… రారా సామి (సామి)
బంగరు సామి… మీసాల సామి
రోషాల సామి
పిక్కల పైదాకా… పంచె నువ్ ఎత్తికడితే
పిక్కల పైదాకా… పంచె నువ్ ఎత్తికడితే
నా పంచ ప్రాణాలు పోయెను సామి
కార కిల్లి నువ్… కస్సు కస్సు నములుతుంటే
నా ఒళ్ళు ఎర్రగా పండేను సామి
నీ అరుపులు కేకలు ఇంటా ఉంటే
ఏ ఏఏ ఏ ఏ ఏఏఏ ఏ ఏ
నీ అరుపులు కేకలు ఇంటా ఉంటే
పులకారింపులే సామి
నువ్ కాలు మీద కాలేసుకుంటే
పూనకాలే సామి
రెండు గుండీలు ఎత్తి
గుండెను సూపిత్తే
పాలకుండ లెక్క పొంగిపోతా
సామి నా సామి
నా సామి… రారా సామి
బంగరు సామి… మీసాల సామి
రోషాల సామి
నా సామి (సామి)… రారా సామి (సామి)
బంగరు సామి… మీసాల సామి
రోషాల సామి
కొత్త సీరె కట్టూకుంటే, ఏ… ఎట్టా ఉందో సెప్పాకుంటే, ఏ
కొత్త సీరె కట్టూకుంటే… ఎట్టా ఉందో సెప్పాకుంటే
కొన్న ఇలువ సున్నా అవదా సామి
కొప్పులోన పువ్వులు పెడితే
గుప్పున నువ్వే పీల్చకుంటే
పూల గుండె రాలి పడదా సామి
నా కొంగే జారేటప్పుడు నువ్వూ
ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ
నా కొంగే జారేటప్పుడు నువ్వే
సూడకుంటె సామి
ఆ కొంటె గాలి నన్నే చూసి
జాలే పడదా సామి
నా అందం సందం నీదవ్వకుంటే
ఆడ పుట్టుకే బీడైపోదా
సామీ… నా సామీ
నా సామి… రారా సామి
బంగరు సామి… మీసాల సామి
రోషాల సామి
నా సామి (సామి)… రారా సామి (సామి)
బంగరు సామి… మీసాల సామి
రోషాల సామి