Telusuna Telusuna Song Lyrics written by Sirivennela Seetharama Sastry Garu, Sung by Popular singer Chitra Garu and music composed by Devi Sri Prasad Garu from the Telugu film ‘Sontham‘.
తెలుసునా తెలుసునా… మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా… అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో… అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏవిటో… అని బయట పడలేక
ఎలా ఎలా… దాచి ఉంచేది
ఎలా ఎలా… దాన్ని ఆపేది
తెలుసునా తెలుసునా… మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా… అతడిని మెలమెల్లగా
అతడు ఎదురైతే… ఏదో జరిగిపోతుంది
పెదవి చివరే… పలకరింపు నిలచిపోతుంది
కొత్త నేస్తం కాదుగా… ఇంత కంగారెందుకు
ఇంతవరకు లేదుగా… ఇపుడు ఏమైందో
కనివిని ఎరుగని… చిలిపి అలజడి నిలుపలేక
తెలుసునా తెలుసునా… మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా… అతడిని మెలమెల్లగా
గుండె లోతుల్లొ… ఏదో బరువు పెరిగింది
తడిమి చూస్తే… అతని తలపే నిండి పొయిందే
నిన్నదాక ఎప్పుడు… నన్ను తాకేటప్పుడు
గుండెలో ఈ చప్పుడు… నేను వినలేదే
అలగవే హృదయమా… అనుమతైనా అడగలేదని
తెలుసునా తెలుసునా… మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా… అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో… అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏవిటో… అని బయట పడలేక
ఎలా ఎలా… దాచి ఉంచేది
ఎలా ఎలా… దాన్ని ఆపేది
కలవనా కలవనా… నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా… ప్రియతమా అని కొత్తగా